Share News

Temple Services: టీటీడీ సేవలు ఎలా ఉన్నాయి?

ABN , Publish Date - Dec 10 , 2025 | 05:07 AM

తిరుమలలో టీటీడీ సేవలపై భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు వివిధ రకాల ఫీడ్‌బ్యాక్‌ సర్వేలను టీటీడీ ప్రారంభించింది.

 Temple Services: టీటీడీ సేవలు ఎలా ఉన్నాయి?

  • భక్తుల నుంచి విస్తృతంగా అభిప్రాయ సేకరణ

తిరుమల, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): తిరుమలలో టీటీడీ సేవలపై భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు వివిధ రకాల ఫీడ్‌బ్యాక్‌ సర్వేలను టీటీడీ ప్రారంభించింది. ఇందుకోసం తిరుమలలోని వివిధ ప్రదేశాల్లో క్యూఆర్‌ కోడ్‌లను ఏర్పాటు చేశారు. ఈ క్యూఆర్‌ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్‌ చేస్తే 93993 99399 నంబరుతో కూడిన వాట్సాప్‌ నెంబరు ఓపెన్‌ అవుతుంది. అందులో తమ పేరు, విభాగం ఎంచుకుని అభిప్రాయాన్ని టెక్స్ట్‌ లేదా వీడియో ఫార్మాట్‌లో రేటింగ్‌ ఇవ్వొచ్చు. ఇదికాకుండా ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్నప్రసాదం, కల్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వసతి, లగేజీ కౌంటర్‌, ప్రైవేట్‌ హోటళ్ల ధరలు ఇలా 17 ప్రశ్నలపై తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. తిరుమల, తిరుపతిల్లో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై శ్రీవారి సేవకులూ ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.

Updated Date - Dec 10 , 2025 | 05:09 AM