TTD Former EO: గత అధికారులు, చైర్మన్ల పేర్లు చెప్పలేదు
ABN , Publish Date - Nov 14 , 2025 | 06:39 AM
కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ సందర్భంగా టీటీడీలో గతంలో పనిచేసిన అధికారులు, చైర్మన్ల పేర్లు తాను చెప్పలేదని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి
తిరుపతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ సందర్భంగా టీటీడీలో గతంలో పనిచేసిన అధికారులు, చైర్మన్ల పేర్లు తాను చెప్పలేదని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. టీటీడీ గత అధికారులను విచారించినట్లుగానే తనను కూడా సిట్ అధికారులు విచారించారని అన్నారు. టీటీడీలో నెయ్యి కొనుగోలుకు సంబంధించిన వివరాలు, విధానాలు, అధికారుల బాధ్యతల గురించి వారు ప్రశ్నించారని, అందుకు సంబంధించిన సమాధానాలు వివరంగా చెప్పానన్నారు. ఆ సందర్భంగా తాను సహనం కోల్పోయి గతంలో పనిచేసిన అధికారులు, చైర్మన్ల పేర్లు చెప్పాననడం వాస్తవం కాదన్నారు. సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. విచారణ విషయాలను బహిర్గతం చేయడం బాధ్యతారాహిత్యం అవుతుందని పేర్కొన్నారు.