TTD Chairman B.R. Naidu: శ్రీవారి దర్శనం పేరుతో మోసపోకండి
ABN , Publish Date - Oct 19 , 2025 | 02:54 AM
తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కోసం దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు..
తిరుమల, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కోసం దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొందరు టీటీడీలో, ప్రభావిత స్థానాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులమంటూ ప్రలోభ పెడుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే కొందరు దళారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. శ్రీవారి దర్శనం, ఆర్జితసేవలు, వసతి కోసం ‘టీటీదేవస్థానమ్స్.ఏపీ.జీవీవో.ఇన్’లో బుక్ చేసుకోవాలని సూచించారు. సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబరు 155257లో సంప్రదించవచ్చన్నారు. దళారులపై అనుమానం వస్తే టీటీడీ విజిలెన్స్ అధికారులు 0877-2263828 నంబరు ద్వారా నిరంతరాయంగా అందుబాటులో ఉంటారని తెలిపారు.