Bihar Government: పాట్నాలో టీటీడీ ఆలయం
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:04 AM
బిహార్ రాజధాని పాట్నాలో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు 10.11 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
10.11 ఎకరాలు కేటాయించిన బిహార్ ప్రభుత్వం
తిరుమల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బిహార్ రాజధాని పాట్నాలో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు 10.11 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మోకామా ఖాస్ ప్రాంతంలో ఈ స్థలాన్ని కేటాయించినట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్ లేఖ రాశారు. 99 సంవత్సరాల పాటు రూ.1 టోకెన్ లీజ్ రెంట్‌తో ఈ స్థలాన్ని కేటాయించారు. దీనిపై టీటీడీతో ఎంవోయూ చేసుకునేందుకు బిహార్ రాష్ట్ర పర్యాటకశాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. స్థల కేటాయింపుపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కూడా అభినందించినట్టు బీఆర్ నాయుడు తెలిపారు.