Share News

భక్తులకు అందుబాటులో టీటీడీ 2026 డైరీలు, క్యాలెండర్లు

ABN , Publish Date - Oct 09 , 2025 | 04:44 AM

2026 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు గురువారం నుంచి భక్తులకు లభిస్తాయి. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, విశాఖపట్టణం, విజయవాడ సహా అనేక ప్రాంతాల్లో...

భక్తులకు అందుబాటులో టీటీడీ 2026 డైరీలు, క్యాలెండర్లు

తిరుమల, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): 2026 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు గురువారం నుంచి భక్తులకు లభిస్తాయి. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, విశాఖపట్టణం, విజయవాడ సహా అనేక ప్రాంతాల్లో వీటిని భక్తులకు అందుబాటులో ఉంచారు. టీటీడీ ఆలయాలు, పలు కళ్యాణమండపాల వద్ద ఇవి లభిస్తాయి. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ‘తిరుమల.ఓఆర్జీ’, ‘టీటీదేవస్థానమ్స్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌’ ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చు. తిరుమలలోని పబ్లికేషన్‌ స్టాల్‌లోనూ, తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా ఉన్న సేల్స్‌ సెంటర్‌, గోవిందరాజస్వామి ఆలయం ముందున్న ధ్యాన మందిరం, శ్రీనివాసం, విష్ణు నివాసం, తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్స్‌ స్టాల్స్‌లో ఇవన్నీ లభిస్తాయి.

Updated Date - Oct 09 , 2025 | 04:46 AM