TTD: శ్రీవారి ట్రస్టులకు రూ.1.05 కోట్ల విరాళం
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:19 AM
తిరుమల శ్రీవారి ట్రస్టులకు పలువురు దాతలు రూ.1.05 కోట్లను సోమవారం విరాళంగా అందజేశారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఏడీవో ఫౌండేషన్ అనే ఎన్జీవో....
డీడీలు అందజేసిన పలువురు దాతలు
తిరుమల, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ట్రస్టులకు పలువురు దాతలు రూ.1.05 కోట్లను సోమవారం విరాళంగా అందజేశారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఏడీవో ఫౌండేషన్ అనే ఎన్జీవో సంస్థ రూ.75 లక్షలు అందజేసింది. విరాళం డీడీని ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి అందజేసి ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు వినియోగించాలని కోరారు. బెంగళూరుకు చెందిన ఎం.రాకేష్ రెడ్డి బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు, తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ రూ.10 లక్షలు విరాళాన్ని ఎస్వీ విద్యాదానం ట్రస్టుకు, గుంటూరుకు చెందిన సింహాద్రి వెంకట శివప్రసాద్ అనే భక్తుడు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు.