AP Govt: ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు అక్షయపాత్ర భోజనం
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:26 AM
ఆర్జీయూకేటీ(రాష్ట్ర ట్రిపుల్ ఐటీలు)ల్లో అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నేడు నాలుగు క్యాంప్‌సలలో ఒప్పందాలు
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఆర్జీయూకేటీ(రాష్ట్ర ట్రిపుల్ ఐటీలు)ల్లో అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని నాలుగు క్యాంప్‌సలలో ప్రస్తుతం తాత్కాలిక విధానంలో కాంట్రాక్టర్లు మెస్‌లు నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్లపై ఫిర్యాదులు రావడంతో వారిని తొలగించి వీరిని నియమించారు. అయితే వీరి పనితీరుపై కూడా ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లాభాపేక్ష లేని అక్షయపాత్ర సంస్థకు మెస్ నిర్వహణ అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం నాలుగు క్యాంప్‌సలలో వేర్వేరుగా అక్షయపాత్రతో ఒప్పందాలు చేసుకోనున్నారు.