శంభాజీ మహారాజ్‌కు చిత్రనివాళి
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:00 AM
ధర్మవీరుడు శంభాజీ మహారాజ్ వర్దంతి(మార్చి 11) సందర్భంగా ఆయన జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యఘట్టాలను ఒకే చిత్రంలో చిత్రీకరించాడు నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్. శంభాజీ బాల్యం నుంచి మరణం వరకు ఉన్న ప్రధాన ఘట్టాలు ఈ చిత్రంలో చూడవచ్చు.

నంద్యాల కల్చరల్, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ధర్మవీరుడు శంభాజీ మహారాజ్ వర్దంతి(మార్చి 11) సందర్భంగా ఆయన జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యఘట్టాలను ఒకే చిత్రంలో చిత్రీకరించాడు నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్. శంభాజీ బాల్యం నుంచి మరణం వరకు ఉన్న ప్రధాన ఘట్టాలు ఈ చిత్రంలో చూడవచ్చు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ కుమారుడే శంభాజీ మహారాజ్ అన్నారు. శివాజీ మరణం తర్వాత శంభాజీ మహారాజ్ 9 సంవత్సరాలు పరిపాలన చేసి 120 యుద్ధాల్లో తమ పరాక్రమం చూపించిన ధీరశాలి అన్నారు. శంభాజీ మహారాజ్ తన తండ్రి ఛత్రపతి శివాజీ మాదిరిగానే మంచి పరిపాలన చేశారన్నారు. ఆయన పాలనలో స్త్రీలను గౌరవించడం, మంచి క్రమశిక్షణ, బాధ్యత కలిగిన పరిపాలకుడు అన్నారు.