Share News

Gummidi Sandhya Rani: గిరిజన విద్యార్థుల స్కాలర్‌షిప్పులు విడుదల

ABN , Publish Date - Dec 26 , 2025 | 05:07 AM

గిరిజన విద్యార్థులపోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పల విషయంలో గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌ ఉన్న బకాయిలను కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి ....

Gummidi Sandhya Rani: గిరిజన విద్యార్థుల స్కాలర్‌షిప్పులు విడుదల

  • మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడి

అమరావతి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థులపోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పల విషయంలో గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌ ఉన్న బకాయిలను కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో గత ప్రభుత్వం కేవలం రూ.18.67 కోట్లు విడుదల చేయగా, పెండింగ్‌లో ఉన్న మూడు త్రైమాసికాలకు గాను రూ.71.67 కోట్లు కూటమి ప్రభుత్వ నేరుగా 69,227 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం స్కాలర్‌షిప్పు నిధులు ఆర్‌టీఎఫ్‌ కింద రూ.85.67 కోట్లు కళాశాలల ఖాతాల్లోకి, ఎంటీఎఫ్‌ రూ.9.11 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి మొత్తం 42,203 మందికి విడుదల చేసినట్టు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రస్తుతం అర్హులైన విద్యార్థులకు నిధులను విడుదల చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.100.93 కోట్లు విడుదల చేసి, 59,297 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నామన్నారు. తద్వారా గిరిజన విద్యార్థుల విద్య నిలకడగా, సానుకూలంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 05:07 AM