అడవుల నుంచి ఆదివాసీల గెంటివేతను వ్యతిరేకించాలి: రైతుకూలీ సంఘం
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:09 AM
అభివృద్ధి పేరుతో అడవుల నుంచి ఆదివాసీల గెంటివేతను వ్యతిరేకించాలని రైతుకూలీ సంఘం (ఏపీ) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
విజయవాడ (గాంధీనగర్), నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పేరుతో అడవుల నుంచి ఆదివాసీల గెంటివేతను వ్యతిరేకించాలని రైతుకూలీ సంఘం (ఏపీ) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. గిరిజన ప్రాంతాల్లో ప్రజలపై ప్రభుత్వం కొనసాగిస్తున్న నిర్బంధకాండను ఖండించింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ...సంయుక్త కిసాన్‌మోర్చా పిలుపు మేరకు ఈనెల 26న దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలు, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రుణమాఫీ చేయాలని, వ్యవసాయ కూలీల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలుపుదల చేయాలన్నారు.