Share News

Ram Mohan Naidu: ఏపీలో ముక్కోణపు అభివృద్ధి

ABN , Publish Date - Nov 15 , 2025 | 07:03 AM

ఆంధ్రప్రదేశ్‌లో.. అమరావతి, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ముక్కోణపు అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అన్నారు.

Ram Mohan Naidu: ఏపీలో ముక్కోణపు అభివృద్ధి

  • ప్రతి ఒప్పందం ఒక విజయగాథగా మారుతుంది

  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో.. అమరావతి, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ముక్కోణపు అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అన్నారు. విశాఖలో శుక్రవారం మొదలైన పెట్టుబడిదారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ... ఏపీలో పెట్టుబడి పెట్టడమంటే ఒక రాష్ట్రంలో పెట్టడం కాదని, మైండ్‌సెట్‌పై పెట్టడం వంటిదని అభివర్ణించారు. ఇక్కడ జరిగే ప్రతి అవగాహన ఒప్పందం ఒక విజయ గాథగా మారుతుందన్నారు. ‘సమయమే చివరికి అసలైన ధనం’గా నిలుస్తుందన్నారు. ఏపీ ప్రజలు కష్టపడి పనిచేసేతత్వం కలిగిన వారని, అందుకే వారికి విజయాలు సొంతం అవుతాయని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నడుస్తోందని, యూనిటీ, క్లారిటీతో పరిపాలన జరుగుతోందని చెప్పారు. ఏపీలో ఫ్లైట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, స్కిల్‌ యూనివర్సిటీ, డ్రోన్‌ సిటీ, స్పేస్‌ సిటీ ఇలా అనేకం ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 07:04 AM