జీజీహెచలో చెట్ల నరికివేత
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:32 PM
పట్టణంలోని జీజీహెచలో చెట్లను నరికివేశారు.
నంద్యాల హాస్పిటల్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని జీజీహెచలో చెట్లను నరికివేశారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అధికార యంత్రాంగం ఏకంగా తొమ్మిది చెట్లను నరికివేయడం గమనార్హం. ఆస్పత్రికి వచ్చిన రోగులు, సహాయకులు చెట్లకింద సేదతీరుతుంటారు. చెట్లను నరికివేయడంతో ఆ ప్రాంతంలో రోగులకు నిలువ నీడలేకుండా పోయింది. చెట్ల నరికివేతకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. ఈ సంఘటనపై జీజీహెచ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరిని వివరణ కోరగా చెట్ల ఆకులు భవనంపై ఉన్న నీళ్లట్యాంకులో పడుతుండటంతో పైప్‌లైన్లు బ్లాక్ అయి ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా చెట్లను తొలగించామన్నారు. అయితే చెట్లను కొంతమేరకు తొలగించి ఉంటే ఎలాంటి సమస్య ఉండేదికాదు. కానీ నేలవరకు తొలగించడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.