ఆరుగురు తహసీల్దార్ల బదిలీ
ABN , Publish Date - Jun 07 , 2025 | 01:18 AM
జిల్లాలో ఆరుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీలోగా బదిలీ అయిన అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- 24 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 17 మంది సీనియర్ అసిస్టెంట్లు కూడా..
-ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ బాలాజీ
మచిలీపట్నం, జూన్6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆరుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీలోగా బదిలీ అయిన అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని మెజిస్టీరియల్ సెక్షన్‌లో పనిచేస్తున్న బి.మురళీకృష్ణను బాపులపాడు తహసీల్దార్‌గా బదిలీ చేశారు. బాపులపాడు తహసీల్దార్ వి.నాగ భూషణాన్ని మచిలీపట్నం నార్త్ తహసీల్దార్‌గా, కోడూరు తహసీల్దార్ బి.శ్రీనునాయక్‌ను మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయ ఏవోగా, కలెక్టరేట్ ఏవోగా పనిచేస్తున్న సీహెచ్ వీరాంజనేయప్రసాద్‌ను నాగాయలంక తహసీల్దార్‌గా, నాగాయలంక తహసీల్దార్ ఎం.హరనాథను కలెక్టరేట్‌లోని ల్యాండ్ అక్విజేషన్ ప్రత్యేక తహసీల్దార్‌గా, కలెక్టరేట్‌లో ల్యాండ్ అక్విజేషన్ ప్రత్యేక తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఏఎస్‌ఎన్ రాధికను కలెక్టరేట్ ఏవోగా బదిలీ చేశారు. వీరితోపాటు మరో 24 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 17మంది సీనియర్ అసిస్టెంట్‌లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.