Share News

రైళ్ల సర్వీసులను పునరుద్ధరించాలి

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:02 AM

కరోనా సమయంలో రద్దయిన రైళ్ల సర్వీసులను పునరుద్ధరించాలని సీపీఐ మండల కార్యదర్శి భార్గవ్‌ అన్నా రు.

 రైళ్ల సర్వీసులను పునరుద్ధరించాలి
బేతంచెర్ల రైల్వేస్టేషన ముందు ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

బేతంచెర్ల స్టేషన ముందు సీపీఐ ఆఽధ్వర్యంలో ధర్నా

బేతంచెర్ల, జూన 9 (ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలో రద్దయిన రైళ్ల సర్వీసులను పునరుద్ధరించాలని సీపీఐ మండల కార్యదర్శి భార్గవ్‌ అన్నా రు. సోమవారం వైసీపీ నాయకులు పిట్టల జాకీర్‌ హుశేన, గోరుమాను కొండ సర్పంచ కోడే వెంకటేశ్వర్లు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఉద య్‌, సీపీఐ మండల కార్యదర్శలు తిరుమలేష్‌, దస్తగిరి, పట్టణ కార్యదర్శి నాగరాజు, నాయకులు, కార్యకర్తలతో కలిసి రైల్వేస్టేషన ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం స్టేషన మాస్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు దూర ప్రయాణాలు చేసేం దుకు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం స్పందించి రద్ధయిన రైళ్ల సర్వీసులను తిరిగి ప్రారంభించాలన్నారు. అలాగే స్టేషనలో తాగునీరు ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు, షెడ్లు నిర్మాణం, కనీసమౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎల్లకృష్ణ, ప్రదీఫ్‌, భాస్కర్‌, కోట్ల మధు, ఆనపాల తిరుమలేష్‌, ఆల్తాఫ్‌, లయన్స క్లబ్‌ వలి, నగేష్‌, పాలిష్‌ కట్టర్‌, ఎస్‌టీ హరూన బాసా, ఆటో రవి, అభి పాల్గొన్నారు.

డోన టౌన: కరోనా సమయంలో రద్దు చేసిన ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తిరిగి కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కే.రామాంజ నేయులు, పట్టణ కార్యదర్శి మోట రాముడు కోరారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుంచి రైల్వేస్టేషన వరకు సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం 30 డిమాండ్లతో కూడిన వినతి పత్రా న్ని డిప్యూటీ రైల్వేస్టేషన మేనేజర్‌కు అందజేశారు. కార్యక్రమంలో రాధా కృష్ణ, బి.నారాయణ, రామ్మోహన, పుల్లయ్య, హుశేన పీరా, ఎం.రామ్మోహన, లక్ష్మిదేవి, అమృత రెడ్డి, అన్వర్‌, బాలమద్దయ్య, చంద్రశేఖర్‌, కొండయ్య, పాపారాయుడు, రంగస్వామి, రాఘవేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 12:02 AM