Chamarajanagara District: ఏనుగుతో సెల్ఫీ.. ప్రాణాల మీదికి!
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:25 AM
చామరాజనగర జిల్లా బండిపుర అభయారణ్యం ప్రాంతంలో రోడ్డు పక్కన వెళ్తున్న ఓ ఏనుగుతో సెల్ఫీ తీసుకునేందుకు పర్యాటకుడు దానికి దగ్గరగా వెళ్లాడు
ఇంటర్నెట్ డెస్క్: చామరాజనగర జిల్లా బండిపుర అభయారణ్యం ప్రాంతంలో రోడ్డు పక్కన వెళ్తున్న ఓ ఏనుగుతో సెల్ఫీ తీసుకునేందుకు పర్యాటకుడు దానికి దగ్గరగా వెళ్లాడు. గమనించిన ఏనుగు, అతడి వెంటపడింది. తప్పించుకునే క్రమంలో పరుగెత్తలేక అతడు కిందపడ్డాడు. అతని వద్దకు వచ్చిన ఏనుగు కాలితో సున్నితంగా తన్ని, అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పగాయాలతో బయటపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
- బెంగళూరు, ఆంధ్రజ్యోతి