Share News

Tourist Attraction: మంచు కొండల్లోన...

ABN , Publish Date - Dec 08 , 2025 | 04:58 AM

మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

Tourist Attraction: మంచు కొండల్లోన...

పాడేరు/అరకులోయ, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌లో నమోదు అవుతుండడంతో పొగమంచు దట్టంగా కురుస్తోంది. దీంతో సహజసిద్ధ ప్రకృతి అందాలు మరింత శోభాయమానంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాడేరు మండలంలోని వంజంగి మేఘాల కొండ, అరకులోయ మండలంలోని మాడగడ వ్యూపాయింట్‌, చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని చెరువులవేనం మేఘాల కొండ పరిసరాల్లో దట్టంగా పరుచుకున్న మంచు మేఘాలను చూసి సందర్శకులు పరవశించిపోయారు.

Updated Date - Dec 08 , 2025 | 04:58 AM