Share News

జ్యోతిర్ముడి శివస్వాములకు మాత్రమే స్పర్శదర్శనం

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:47 PM

జ్యోతిర్ముడి కలిగి ఉన్న శివస్వాములకు మాత్రమే శుక్రవారం వరకు ప్రతిరోజు రెండు గంటలకు ఒకసారి ఉచిత స్పర్శ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన చైర్మన రమే్‌షనాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

   జ్యోతిర్ముడి శివస్వాములకు మాత్రమే స్పర్శదర్శనం
శ్రీశైల దేవస్థానం చైర్మన రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు

రెండు గంటలకు ఒకసారి ప్రత్యేక స్లాటు

శ్రీశైలం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జ్యోతిర్ముడి కలిగి ఉన్న శివస్వాములకు మాత్రమే శుక్రవారం వరకు ప్రతిరోజు రెండు గంటలకు ఒకసారి ఉచిత స్పర్శ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన చైర్మన రమే్‌షనాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. కార్తీక మాసాంతం మండల దీక్షలు పూర్తి చేసుకుని మాల విరమణ చేసేందుకు శివస్వాములు వేలాదిగా శ్రీశైలానికి తరలి వస్తున్నారన్నారు. ఆనలైనలో ముందుగానే గర్భాలయ, సామూహిక అభిషేకాలు నమోదు చేసుకున్న సేవాకర్తలకు మాత్రం నిర్ణీత టైంస్లాట్‌ ప్రకారం దర్శనాలు కల్పించనున్నామని అఆ్నరు. వీవీఐపీ సిఫార్సు లేఖలు, ఆనలైన వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ఈనెల 8వ తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అధిక సంఖ్యలో వస్తున్న యాత్రికులందరికీ దర్శనభాగ్యం కల్పించాల్సినందున అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంచారన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 11:47 PM