Tomato Price: టమాటా కిలో రూ.4
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:11 AM
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు పతనమయ్యాయి. కిలో టమాటా ధర మరీ ఘోరంగా రూ.4కి పడిపోయింది. పది కిలోల గంపలు....
పత్తికొండ మార్కెట్‌లో పతనమైన ధరలు
పత్తికొండ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు పతనమయ్యాయి. కిలో టమాటా ధర మరీ ఘోరంగా రూ.4కి పడిపోయింది. పది కిలోల గంపలు రెండింటికి రూ.80 నుంచి రూ.100కు మించి ధర పలకలేదు. వ్యాపారులు 25 కిలోల గంపలు రెండు కనిష్ఠంగా రూ.180కి కొనుగోలు చేశారు. దీంతో రైతులు ఆగ్రహంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. దసరా సందర్భంగా 1, 2వ తేదీల్లో మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. దీంతో రెండు రోజుల నుంచి కోతకు సిద్ధంగా ఉన్న పంటను రైతులు మార్కెట్ తీసుకొచ్చారు. శనివారం మార్కెట్‌కు 5.5 టన్నులు దాటి అమ్మకానికి రావడంతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసినా రైతులు పట్టించుకోలేదు. ఆదివారం కూడా తక్కువ ధరకే కొనుగోలు చేయడంతో ఆగ్రహించి ధర్నా చేపట్టారు.