Anantapur: పిల్లలకు వాటర్ బాటిల్ ఇస్తున్నారా..
ABN , Publish Date - Sep 13 , 2025 | 07:27 AM
ఆడుకుంటూ పొర పాటున వాటర్ బాటిల్ మూత మింగి ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం నగరానికి చెందిన మౌనిక గుత్తి పట్టణ సమీపంలోని...
అనంతపురం క్రైం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆడుకుంటూ పొర పాటున వాటర్ బాటిల్ మూత మింగి ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం నగరానికి చెందిన మౌనిక గుత్తి పట్టణ సమీపంలోని ఎన్‌పీటీసీ ట్రాన్స్‌కో విభాగంలో ఏడీఈగా విధులు నిర్వహి స్తున్నారు. ఆమె భర్త యుగంధర్ అనంతపురంలో ఆర్‌అండ్‌బీ ఏఈగా పనిచేస్తున్నారు. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు రక్షిత్ రామ్ ఉన్నారు.

మౌనికకు నైట్ షిఫ్ట్ ఉండటం, కుమారుడు ఇంకా తల్లిపాలను మానకపోవడంతో వెంట తీసుకుని విధులకు వచ్చారు. వీరి వెంట ఆమె మామ కూడా ఉన్నారు. మౌనిక విధి నిర్వహణలో ఉన్న సమయంలో బాలుడు ఆడుకుంటూ పొరపాటున వాటర్ బాటిల్ మూత మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరి అందక విలవిల్లాడాడు. మౌనిక వెంటనే బాలుడిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా సీపీఆర్ చేశారు. ఎంత ప్రయత్నించినా చిన్నారిని కాపాడటం సాధ్యం కాలేదని తెలిపారు. కన్న కొడుకు మృతితో మౌనిక గుండెలవిసేలా రోదించారు.