Share News

Toddler Dies After Hot Milk: వేడి పాలు మీదపడి చిన్నారి మృతి

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:05 AM

వేడి పాలు మీద పడటంతో అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఓ చిన్నారి మృతి చెందాడు. గుత్తిలోని కోట వీధికి చెందిన ప్రతాప రెడ్డి..

Toddler Dies After Hot Milk: వేడి పాలు మీదపడి చిన్నారి మృతి

గుత్తి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వేడి పాలు మీద పడటంతో అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఓ చిన్నారి మృతి చెందాడు. గుత్తిలోని కోట వీధికి చెందిన ప్రతాప రెడ్డి, మేనక దంపతులకు కుమారుడు శర్విల్‌ రెడ్డి(15 నెలలు) ఉన్నాడు. వేడి చేసిన పాలను బుధవారం సాయంత్రం ఓ టేబుల్‌ మీద ఉంచగా బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఆ గిన్నెను లాగడంతో ముఖం మీద పడ్డాయి. బాలుడిని తల్లిదండ్రులు వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 21 , 2025 | 04:05 AM