Share News

Tirupati SV University Police: రేపు విచారణకు రండి

ABN , Publish Date - Oct 22 , 2025 | 06:16 AM

గోవులు మృతిచెందాయంటూ ప్రచారంచేసిన వ్యవహారంలో విచారణ నిమిత్తం గురువారం విచారణకు రావాలంటూ టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డికి...

Tirupati SV University Police: రేపు విచారణకు రండి

  • గోవుల మృతిపై ఆధారాలు చూపండి.. భూమనకు పోలీసుల నోటీసు

తిరుపతి (నేరవిభాగం), అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): గోవులు మృతిచెందాయంటూ ప్రచారంచేసిన వ్యవహారంలో విచారణ నిమిత్తం గురువారం విచారణకు రావాలంటూ టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డికి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం భూమన వాట్సా్‌పకు నోటీసులు పంపారు. ఎస్వీ గోశాలలో అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేకపోవడంతో పదుల సంఖ్యలో గోవులు అకాల మరణం చెందాయంటూ గతంలో ఆయన ఆరోపణలు చేశారు. భూమన టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తులు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ అప్పట్లో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో భూమనకు నోటీసులు జారీచేసిన పోలీసులు ఆరోపణలకు ఆధారాలు చూపాలని కోరారు.

Updated Date - Oct 22 , 2025 | 06:17 AM