YSRCP Leader: తిరుమలలో మద్యం బాటిల్‌తో వైసీపీ నేత
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:21 AM
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఓ వైసీపీ నేత మద్యం బాటిల్‌తో హల్‌చల్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
తిరుమల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఓ వైసీపీ నేత మద్యం బాటిల్‌తో హల్‌చల్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా తిరుమలకు మద్యం తాగి రావడం, మద్యం తీసుకురావడం నిషేధం. అయితే తిరుమలకు చెందిన భీమవరపు నాగరాజురెడ్డి అనే వైసీపీ నేత బాలాజీనగర్ సమీపంలోని రింగురోడ్డులో మద్యం బాటిల్ చేతపట్టుకుని ముద్దాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాగరాజురెడ్డి గత ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌ల వద్ద నిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్‌రెడ్డికి ఓట్లు వేయాలని ప్రచారం చేయడం విమర్శలకు దారితీసింది. తిరుమలలో తట్టల దందా చేశాడనే ఆరోపణలు కూడా ఆయన ఉన్నాయి. అలాగే చిట్టీ, వడ్డీ వ్యాపారంతో స్థానిక వ్యాపారులను దోచుకున్నాడనే ఫిర్యాదులు కూడా అధికంగా ఉన్నాయి. ఇటీవల నాగరాజు వేధించాడంటూ హరీ్‌షరెడ్డి అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాజాగా మద్యం బాటిల్‌తో ఉన్న ఫొటోలు వెలుగులోకి రావడంతో నాగరాజు మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ ఫొటోలు ఎప్పటివి అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఫొటోలు ఎప్పటివైనా తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా రోడ్డుపైనే మద్యం బాటిల్ పట్టుకుని ఉండటంపై టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.