Tirumala Temple: 7న చంద్ర గ్రహణం
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:13 AM
చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబరు 7న తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం తలుపులను 12 గంటల పాటు మూసివేయనున్నారు. ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్ర గ్రహణం....
12 గంటలపాటు తిరుమల ఆలయం మూసివేత
తిరుమల, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబరు 7న తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం తలుపులను 12 గంటల పాటు మూసివేయనున్నారు. ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై 8వ తేదీ వేకువజామున 1.31 గంటలకు పూర్తవుతుంది. దీంతో ఆదివారం సాయంత్రం 3.30 నుంచి 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం ప్రారంభవుతుంది. గ్రహణం కారణంగా 7వ తేదీ ఉంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే తిరుమలలో అన్నప్రసాదాల వితరణ నిలిపివేస్తారు. 8వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి ప్రసాదాల వితరణ మొదలువుతుంది. అయితే భక్తులు ఇబ్బంది పడకుండా 30వేల పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేసి 7వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుంచి పంపిణీ చేస్తారు.