Tirumala Sri Vari Temple: తెరుచుకున్న శ్రీవారి ఆలయం తలుపులు
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:19 AM
గ్రహణంతో మూతబడిన తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు సోమవారం తెల్లవారుజామున..
తిరుమల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గ్రహణంతో మూతబడిన తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి తెరుచుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు తలుపులు మూసివేసిన విషయం తెలిసిందే. సోమవారం వేకువజామున ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.