Share News

Tirumala: పరకామణి కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం

ABN , Publish Date - Nov 09 , 2025 | 06:30 AM

తిరుమల పరకామణి కేసు దర్యాప్తును సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ బృందం ముమ్మరం చేసింది.

 Tirumala: పరకామణి కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం

తిరుపతి(నేరవిభాగం), నవంబరు 8(ఆంధ్రజ్యోతి): తిరుమల పరకామణి కేసు దర్యాప్తును సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ బృందం ముమ్మరం చేసింది. సాంకేతిక సహకారంతో ఆధారాల సేకరణ దిశగా అడుగులేస్తోంది. తొలిరోజైన గురువారం తిరుమలలో పరకామణి, కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్‌తో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ కేసులో నిందితుడు రవికుమార్‌, ఆయన భార్య, కుమార్తెను శుక్రవారం విచారించి వీడియో రికార్డింగ్‌ చేశారు. ఇక, పరకామణి కేసులో టీటీడీలో మిగతావారి పాత్రపై ఆరా తీసే క్రమంలో అప్పటి ఏవీఎ్‌సవో సతీశ్‌కుమార్‌ను విచారించడానికి త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. కాగా, ఆదాయానికి మించి రవికుమార్‌ కూడబెట్టిన ఆస్తులపై తనిఖీలు చేయడానికి ఏసీబీ సిద్ధమైనట్లు సమాచారం.

Updated Date - Nov 09 , 2025 | 06:30 AM