Share News

Constable Gurappa: శ్రీవారి ఆలయం వద్ద భక్తుడికి గుండెపోటు

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:09 AM

ఓ కానిస్టేబుల్‌ చాకచక్యంగా వ్యహరించి సీపీఆర్‌ చేసి ఓ భక్తుడిని రక్షించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మామిడిపల్లికి చెందిన మేడం శ్రీనివాసులు...

Constable Gurappa: శ్రీవారి ఆలయం వద్ద భక్తుడికి గుండెపోటు

  • సీపీఆర్‌ చేసి కాపాడిన కానిస్టేబుల్‌

తిరుమల, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ఓ కానిస్టేబుల్‌ చాకచక్యంగా వ్యహరించి సీపీఆర్‌ చేసి ఓ భక్తుడిని రక్షించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మామిడిపల్లికి చెందిన మేడం శ్రీనివాసులు(61) కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనానంతరం రాత్రి 9.30 గంటల సమయంలో లడ్డూలు కొనుక్కుని మ్యూజియం వైపు వస్తున్న క్రమంలో పడమర మాడవీధిలో ఛాతీనొప్పితో కుప్పకూలిపోయారు. అక్కడే విధుల్లో ఉన్న తిరుమల వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ గుర్రప్ప ఆయనకు సీపీఆర్‌ చేయడంతో కోలుకున్నారు. వెంటనే అంబులెన్స్‌ ద్వారా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.

Updated Date - Aug 17 , 2025 | 05:09 AM