Share News

Tight Security at Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు భారీ భద్రత

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:34 AM

మావోయిస్టులు రాష్ట్రంలో మకాం వేశారన్న ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకు భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుకు భారీ భద్రత కల్పించాయి...

Tight Security at Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు భారీ భద్రత

  • మావోయిస్టుల అలజడి నేపథ్యంలో విస్తృత తనిఖీలు, పెట్రోలింగ్‌

  • సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ

పోలవరం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మావోయిస్టులు రాష్ట్రంలో మకాం వేశారన్న ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకు భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుకు భారీ భద్రత కల్పించాయి. ప్రాజెక్టు వద్ద మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించాయి. అనుమానిత ప్రాంతాల్లో నిరంతరాయంగా పెట్రోలింగ్‌ నిర్వహించాయి. ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల నుంచి వచ్చి పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికుల వివరాలను పరిశీలిస్తున్నట్టు ప్రాజెక్టు అవుట్‌పోస్టు సీఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఇక నుంచి ప్రాజెక్టులో భద్రతా ఏర్పాట్లు పటిష్ఠం చేసి, అపరిచిత వ్యక్తుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Nov 19 , 2025 | 05:34 AM