మెగా డీఎస్సీకి పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:44 AM
జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా డీఎస్సీ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్‌లోని తన చాంబర్లో మెగా డీఎస్సీ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారు లకు దిశానిర్ధేశం చేశారు.
- కలెక్టర్ డి.కె.బాలాజీ
- పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశానిర్ధేశం
మచిలీపట్నం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా డీఎస్సీ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్‌లోని తన చాంబర్లో మెగా డీఎస్సీ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారు లకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాల్లో 1,208 పోస్టులకు వివిధ సెషన్ల వారీగా ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత మెగా డీఎస్సీ పరీక్షలు జరుగుతా యన్నారు. శ్రీవాసవీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ-నందమూరు, ఆయాన్ డిజిటల్ జోన్ ఐడిజెడ్ - కానూరు, వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల - కానూరు, ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - కానూరు, ధనేకుల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ - గంగూరు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ - గుడ్లవల్లేరు, శ్రీవిజయదుర్గ ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్ - కానూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని చెప్పారు. ఆయా పరీక్షా కేంద్రాలకు అభ్యర్థుల రాకపోకల నిమిత్తం రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి.వి.జె.రామారావు పాల్గొన్నారు.