Road Accident: వాహనం ఢీకొని పెద్ద పులి మృతి
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:38 AM
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు ఫారెస్ట్ చెక్‌పోస్టు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని పెద్దపులి మృతిచెందింది....
వెల్దుర్తి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు ఫారెస్ట్ చెక్‌పోస్టు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని పెద్దపులి మృతిచెందింది. మార్కాపురం డివిజన్ పరిధిలోని శిరిగిరిపాడు బీట్, సెక్షన్ పరిధిలో ఉన్న నేషనల్ హైవే ఎన్‌హెచ్ 565 రహదారిపై ఈ సంఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న వన్యప్రాణుల (వైల్డ్‌లైఫ్) ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా వైల్డ్ లైఫ్ డీడీ అబ్దుల్ రవూఫ్, డీఎఫ్‌వో నీరజ్‌హాన్స్‌లు మాట్లాడుతూ మృతిచెందినది ఆడపులి అని తేలిందన్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని త్వరలోనే గుర్తిస్తామన్నారు.