Share News

Minister Narayana: టిడ్కో గృహాలకు వెయ్యి కోట్లు అవసరం

ABN , Publish Date - Jul 16 , 2025 | 04:49 AM

రాష్ట్రంలో టిడ్కో ఇళ్లు పూర్తి కావాలంటే రూ.1,000 కోట్లు అవసరమని మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.

Minister Narayana: టిడ్కో గృహాలకు వెయ్యి కోట్లు అవసరం

  • నిధుల కోసం ప్రయత్నిస్తున్నాం.. ఇళ్లు పూర్తి చేసి ఇస్తాం: నారాయణ

తాడేపల్లిగూడెం అర్బన్‌/జగ్గంపేట, జూలై 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టిడ్కో ఇళ్లు పూర్తి కావాలంటే రూ.1,000 కోట్లు అవసరమని మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, కాకినాడ జిల్లా జగ్గంపేటల్లో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఏడు లక్షల టిడ్కో ఇళ్లు మంజూరు చేయించామని చెప్పారు. వాటిలో అప్పట్లోనే 5లక్షల ఇళ్లు పూర్తి చేశామని, మరో 2లక్షల గృహాలను నిర్మించకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అవన్నీ పూర్తి కావాలంటే రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని, నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని, లబ్ధిదారులకు ఇళ్లు పూర్తిచేసి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల నుంచి ప్రతిపాదనలు వస్తే వచ్చే 3నెలల్లో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పాత వార్డుల ప్రకారమే ఎన్నికలు ఉంటాయని వివరించారు. టీడీఆర్‌ బాండ్ల మంజూరులో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నామని, దోషులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని నారాయణ వివరించారు.

Updated Date - Jul 16 , 2025 | 04:51 AM