మార్చిలోపు టిడ్కో గృహాలు: మంత్రి నారాయణ
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:42 AM
రాష్ట్రంలోని 163 టిడ్కో గృహ సముదాయాలు వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోపు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని...
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 163 టిడ్కో గృహ సముదాయాలు వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోపు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి.నారాయణ చెప్పారు. కర్నూలు సమీపంలోని జగన్నాథగట్టు వద్ద టిడ్కో గృహ సముదాయాలను శనివారం ఆయన పరిశీలించారు. కర్నూలులోని టిడ్కో గృహాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.కోటి మంజూరు చేశామని నారాయణ తెలిపారు. కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, కలెక్టర్ పి.రంజిత్‌బాషా, జేసీ బి.నవ్య, ‘కుడా’ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.