థైరాయిడి‘జంకు’
ABN , Publish Date - May 24 , 2025 | 11:41 PM
జుట్టు రాలడం, బరువు తగ్గడం, ఇతర అనారోగ్యాలు, వంటి సమస్యలతో థైరాయిడ్ రోగులు భయపడిపోతున్నారు.
ఆందోళనలో థైరాయిడ్ బాధితులు
రోజురోజుకు పెరుగుతున్న కేసులు
పురుషుల కంటే మహిళలే అధికం
జీవనశైలిలో మార్పుతో నియంత్రించొచ్చు
వరల్డ్ థైరాయిడ్ డే
కర్నూలు హాస్పిటల్, మే 24 (ఆంధ్రజ్యోతి): జుట్టు రాలడం, బరువు తగ్గడం, ఇతర అనారోగ్యాలు, వంటి సమస్యలతో థైరాయిడ్ రోగులు భయపడిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చాలా మందిలో మహిళల్లో వేధిస్తున్న సమస్య థైరాయిడ్. ఆహారం, వ్యాయామాల్లో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ వ్యాధిని అరికట్టవచ్చునని వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారు. థైరాయిడ్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 2007 మే 25వ తేదీన ప్రపంచ థైరాయిడ్ వ్యాధుల నివారణ-ప్రారంభ చికిత్స అన్న నినాదాన్ని ఇచ్చింది.
అవయవాల పనితీరు మందగిస్తుంది..
మన శరీరంలో అన్నిభాగాలు సక్రమంగా పని చేయాలంటే థైరాయిడ్ గ్రంథి పని తీరు బాగా ఉండాలి. ఈగ్రంథి పనితీరులో ఏమాత్రం తేడా కనిపించినా అవయవాల పనితీరు మందగిస్తుంది. ఇది శరీరంలో ఉన్న ముఖ్య గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఇది శరీర ఎదుగుదలలో ప్రధానపాత్ర పోషిస్తుంది. అయితే ఈగ్రంథి పనితీరు గతి తప్పు తుంది. దీంతో హైపర్, హైపో థైరాయిడిజం, గాయిటల్ వంటి సమస్యలు తలెత్తుతు న్నాయి. ఈ గ్రంథి సమతుల్యత తప్పడంతో ఒక్కసారి థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడుతారు.
లక్షణాలు:
ఫ కొన్ని శారీరక లక్షణాలు ద్వారా థైరాయిడ్‌ను గుర్తించవచ్చును. ఆకలి లేకపోవడం, బరువు పెరగడం, త్వరగా అలసిపోవడం, మలబద్దకం, నెలసరి క్రమం తప్పడం, జుట్టు విపరీతంగా రాలడం, చర్మం పొడిగా మారడం, చలికి తట్టుకోలేక పోవడం వంటివి కనిపిస్తే దాన్ని హైపో థైరాయిడిజంగా గుర్తించాలి.
ఫ సరిగానే తింటున్నా విపరీతంగా బరువు తగ్గడం, నిద్ర పట్టకపోవడం, చేతులు వణకడం, మానసిక ఒత్తిడి చల్లగా ఉన్న వేళల్లోనూ వేడిగా అనిపించడం, ఎక్కువగా చెమటలు పట్టడం, నెలసరి క్రమం తప్పడం ఎక్కువసార్లు మలవిసర్జనకు వెళ్లాల్సి రావడం ఈ లక్షణాలు హైపర్ థైరాయిడిజంగా పరిగణించాలి.
మగవారిలో ఒకరు:
పురుషుల్లో కంటే మహిళల్లో అధికంగా కనిపించే హైపర్ థైరాయిడిజం మగవారిలో ఒక్కరికి వస్తే ఆడవారిలో ఏడు మందికి వచ్చే అవకాశాలున్నాయి. మహిళల్లో దాదాపు 4రెట్లు థైరాయిడ్ ఎక్కువగా వస్తుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడే గర్బిణులు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. హైపోథైరాయిడిజం, థైరాక్సిన హార్మోన లోపిస్తే గర్బస్రావం అయ్యే ముప్పు ఎక్కువ. మన దేశంలో గర్భిణుల్లో హైపో థైరాయిడిజం సమస్యలు అధికంగా ఉండటం వల్ల ప్రతి గర్బిణీ తప్పకుండా థైరాయిడ్ పరీక్ష చేసుకోవాలి.
హార్మోన్లు అసమతుల్యత వల్ల..
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎండో క్రైనాలజీ విభాగానికి హార్మోన్ల అసమతుల్యత వల్ల థైరాయిడ్ సమస్యలతో రోగులు వస్తుంటారు. ఎండోక్రైనాలజీ విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఓపీ ఉంటుంది. ఈ విభాగానికి 700 మంది రోగులు వస్తుండగా.. ఇందులో థైరాయిడ్ రోగులు 200 మంది వస్తుంటారు. మిగిలిన విభాగాల్లో మరో 200మంది థైరాయిడ్‌తో చికిత్స పొందుతుంటారు. మొత్తం థైరా యిడ్ రోగుల్లో 70 శాతం మందికి హైపోథైరాయిడ్, 30శాతం మందికి హైపర్ థైరా యిడ్ బాధితులు ఉంటున్నారు. ఎండోక్రైనాలజీ విభాగంలో థైరాయిడ్ సమస్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా గర్బిణులకు థైరాయిడ్ పరీక్షలు తప్పనిస రిగా చేస్తున్నారు.
పరీక్షలు తప్పనిసరి
థైరాయిడ్ రావడానికి శరీరంలోని హార్మోన స్థాయిలో తేడాలే కారణం. కర్నూలు జీజీహెచకు ఎండోక్రైనాలజీ విభాగానికి వారానికి 200 మంది థైరాయిడ్ బాధితులు వస్తుంటారు. ఎండోక్రైనాలజీ డిపార్టుమెంటుతో పాటు గైనిక్, సర్జరీ, మెడిసిన వార్డులకు కూడా రోగులు వస్తుంటారు. థైరాయిడ్ జబ్బులున్న వారు తప్ప కుండా పరీక్షలు చేయించుకొని రెగ్యులర్‌గా మందులు వాడాలి.
- డా.పి.శ్రీనివాసులు, ప్రొఫెసర్ అండ్ హెచవోడీ, ఎండోక్రైనాలజీ విభాగం, జీజీహెచ, కర్నూలు
థైరాయిడ్‌ను అదుపులో ఉంచుకోవాలి
థైరాయిడ్‌ను అదుపులో ఉంచుకోవాలి. కనీసం ఆరు నెలలకొకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. వైద్యులు సూచించిన ప్రకారం రెగ్యులర్‌గా మందులు వాడాలి. జీవనశైలి మార్పులతో వ్యాధిని నియంత్రించవచ్చు. ఆహారంలో అయోడిన లోపం లేకుండా చూసుకోవడం కొంత వరకు థైరాయిడ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
- డా.బి.భరత, ఎండోక్రైనాలజిస్టు, కర్నూలు
మహిళల్లో ఎక్కువ
పురుషుల కన్నా మహిళల్లో థైరాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువ. థైరాయిడ్ గ్రంథిలో కణితులు 1 సెంటీమీటర్ కన్నా ఎక్కువగా ఉంటే ఆపరేషన నిర్వహిస్తారు. మగ వారిలో థైరాయిడ్ గడ్డలు ఉంటే ఎక్కువ శాతం క్యాన్సర్‌గడ్డలు వచ్చే ప్రమాదం ఉంది. కణితి వున్న వారికి ఆపరేషన అవసరం లేదు. క్యాన్సర్‌గా మారితేనే ఆపరేషన చేయించుకోవాలి.
- డా.భార్గవ వ్యాస్, జనరల్ సర్జన, ల్యాప్రోస్కోపిక్ సర్జన, మెడికవర్ హాస్పిటల్, కర్నూలు