Share News

Srikakulam: క్వారీలో పిడుగుపడి ముగ్గురు కార్మికుల మృతి

ABN , Publish Date - Oct 08 , 2025 | 05:10 AM

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం గంగరాజపురం పంచాయతీ పరిధిలోని రాజీయోగ్‌ గ్రానైట్‌ క్వారీలో మంగళవారం సాయంత్రం పిడుగుపడి ముగ్గరు మృతి చెందగా...

Srikakulam: క్వారీలో పిడుగుపడి ముగ్గురు కార్మికుల మృతి

మెళియాపుట్టి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం గంగరాజపురం పంచాయతీ పరిధిలోని రాజీయోగ్‌ గ్రానైట్‌ క్వారీలో మంగళవారం సాయంత్రం పిడుగుపడి ముగ్గరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో బిహార్‌ రాష్ట్రానికి చెందిన శ్రావణ్‌కుమార్‌(45), రాజస్థాన్‌ రాష్ట్రం జాగూర్‌ జిల్లా ముఖన గ్రామానికి చెందిన హేమరాజ్‌ (25), మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పింటు(30) ఉన్నారు. గాయపడిన మరో నలుగురు కార్మికులను టెక్కలి అసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని తహసీల్దార్‌ బి.పాపారావు, సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ మధుసూదనరావు పరిశీలించారు. టెక్కలి అసుపత్రిలో క్షతగాత్రులను జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్డీవో కృష్టమూర్తి పరామర్శించారు.

Updated Date - Oct 08 , 2025 | 05:10 AM