ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు!
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:59 PM
కర్నూలు ఎనఆర్ పేటలోని సాహితి హాస్పిటల్‌లో ఏ.భారతి అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.
కర్నూలు హాస్పిటల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ఎనఆర్ పేటలోని సాహితి హాస్పిటల్‌లో ఏ.భారతి అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్ల మండలం దగడపల్లి గ్రామానికి చెందిన ఏ.భాస్కర్, ఏ.భారతి దంపతులకు మూడేళ్ల క్రితం పెళ్లయింది. సంతానం కలగకపోవడంతో భారతి నగరంలోని ఎనఆర్ పేటలోని సాహితి మెటర్నిటీ ఇనపెర్టిలిటీ ప్రెగ్నెన్సీ కేర్ సెంటర్‌కు చెందిన ప్రసూతి వైద్యురాలు డాక్టర్ శశికళను సంప్రదించారు. మొదటి నెలలోనే భారతి అనే మహిళ గర్బం దాల్చడంతో గర్బంలో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు డాక్టర్ శశికళ గుర్తించారు. ప్రతి నెలా రెగ్యులర్‌గా పరీక్షించి చికిత్స అందించారు. ఈ నెల 5వ తేదీ పురిటినొప్పులు రావడంతో సాహితి హాస్పిటల్‌లో గర్బిణీకి గైనిక్ వైద్యురాలు డా.శశికళ, అనస్తీషియా డాక్టర్ డా.రాంభూపాల్ రెడ్డి చిన్న పిల్లల వైద్యనిపుణులు డా.లక్ష్మినారాయణ ఆపరేషన చేశారు. దీంతో ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మొదట ఆడపిల్ల 1.4 కేజీలు, రెండోసారి ఆడ పిల్ల 1.7 కేజీలు, మూడోసారి అబ్బాయి 1.4 కేజీలతో జన్మించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో బుధవారం వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.