Insulting Ranga Statues: రంగా విగ్రహాలకు అవమానం.. ముగ్గురి అరెస్ట్
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:17 AM
రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రంగా విగ్రహాలను అవమానించిన ముగ్గురిని అరెస్టు చేశామని ఏలూరు జిల్లా కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ తెలిపారు,,,
కైకలూరు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రంగా విగ్రహాలను అవమానించిన ముగ్గురిని అరెస్టు చేశామని ఏలూరు జిల్లా కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ తెలిపారు. ఈ నెల 22న కైకలూరు నియోజకవర్గం కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో వంగవీటి మోహన రంగా విగ్రహాలను అవమానించిన ఘటనలపై కేసు నమోదు చేశామన్నారు. గతంలో ఉన్న గొడవలను పురస్కరించుకుని రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని గొల్లగూడెం గ్రామానికి చెందిన కట్టా ఈశ్వర్ కుమార్, కలిదిండి ఇందిరా కాలనీకి చెందిన ఉండ్రాల అయ్యప్పతో పాటు మరో బాలుడు రంగా విగ్రహానికి పేడ పూశారని తెలిపారు. మంగళవారం ఉదయం కలిదిండి మార్కెట్ యార్డ్ సమీపంలో వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు వెల్లడించారు.