National Accreditation: 3 వ్యవసాయ ప్రయోగశాలలకు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:08 AM
కర్నూలులోని పురుగు మందుల పరీక్షా కేంద్రం, బాపట్లలోని ఎరువుల నియంత్రణ ప్రయోగశాల, నెల్లూరులోని జీవ, సేంద్రియ ఎరువుల నాణ్యత, నియంత్రణ ప్రయోగశాలకు...
అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కర్నూలులోని పురుగు మందుల పరీక్షా కేంద్రం, బాపట్లలోని ఎరువుల నియంత్రణ ప్రయోగశాల, నెల్లూరులోని జీవ, సేంద్రియ ఎరువుల నాణ్యత, నియంత్రణ ప్రయోగశాలకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) సంస్థ గుర్తింపు లభించింది. ఈ ప్రయోగశాలలు తమ సాంకేతిక నైపుణ్యం, గ్లోబల్ ప్రమాణాలతో నాణ్యత పరీక్షల సామర్ధ్యాన్ని నిరూపించడంతో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఎన్‌ఏబీఎల్ గుర్తింపు లభించినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు శుక్రవారం తెలిపారు. దీని ద్వారా వ్యవసాయ వనరుల నాణ్యతపై రైతుల్లో మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ ప్రయోగశాలలనూ దశల వారీగా ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పరిధిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.