Engineering Admissions: నేటి నుంచి మూడో విడత ఈఏపీసెట్ కౌన్సెలింగ్
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:33 AM
జనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈఏపీసెట్ మూడో విడత కౌన్సెలింగ్‌కు సోమవారం సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ జారీచేసింది.
11 వరకు రిజిస్ర్టేషన్.. 15న సీట్ల కేటాయింపు
అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈఏపీసెట్ మూడో విడత కౌన్సెలింగ్‌కు సోమవారం సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. మంగళవారం నుంచి 11వ తేదీ వరకు విద్యార్థులకు రిజిస్ర్టేషన్‌కు అవకాశం కల్పించింది. 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకు గడువిచ్చింది. 13న ఆప్షన్లు మార్చుకోవచ్చు. 15న సీట్లు కేటాయిస్తారు. 15 నుంచి 17 వరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలి. 15 నుంచి తరగతులకు హాజరుకావాలి. కాగా, ఇదే తుది విడత కౌన్సెలింగ్‌గా భావించాలని సాంకేతిక విద్యాశాఖ స్పష్టంచేసింది. అలాగే ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం బైపీసీ స్ర్టీమ్ విద్యార్థులకు ఈఏపీసెట్ తొలివిడత, తుది విడతల కౌన్సెలింగ్ షెడ్యూలు జారీచేసింది. తొలి విడతలో 11 నుంచి 16 వరకు రిజిస్ర్టేషన్, 13 నుంచి 18 వరకు ఆప్షన్ల ఎంపిక, 19న ఆప్షన్లు మార్చుకోవచ్చు. 21న సీట్లు కేటాయిస్తారు. 21 నుంచి 23 వరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలి. 21 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తుది విడతలో 24, 25 తేదీల్లో రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చు.