Share News

ఐక్యతగా ఉండాలి

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:42 PM

గౌడ కులస్తులు ఐక్యతగా ఉండాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ అన్నారు.

ఐక్యతగా ఉండాలి
మాట్లాడుతున్నమాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌

మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌

ఘనంగా కార్తీక వన భోజనోత్సవాలు

నంద్యాల రూరల్‌, నవంబరు16(ఆంధ్రజ్యోతి): గౌడ కులస్తులు ఐక్యతగా ఉండాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ అన్నారు. ఆదివారం మండలంలోని కానాల బుగ్గ రామేశ్వర ఆలయంలో గౌడ కులస్తుల వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ పాల్గొన్నారు. వనభోజనాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మోహనగౌడ్‌, లింగమయ్య, శేషాద్రిగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

హోటల్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో..

నంద్యాల కల్చరల్‌: నంద్యాల హోటల్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో పట్టణంలోని మూలమఠంలోని ఉమ్మడి కర్నూలు జిల్లా అసోసియేషన అధ్యక్షుడు శ్రీనిధి రఘువీర్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం, కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏపీ హోటల్స్‌ అసోసియేషన మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర కల్కూర, జిల్లా ఆహార భద్రతాధికారి వెంకటరాముడు పాల్గొన్నారు. ఉసిరిక చెట్టుకు పూజలు చేసి వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం క్యూబికా స్కిల్స్‌ అకాడమీ వారు కంప్యూటర్‌ స్కిల్స్‌ పై అవగాహన, బాలభవన విద్యార్థులు నృత్యాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లా హోటల్స్‌ అసోసియేషన నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

బంజారా కార్తీక వనభోజనాలు

నంద్యాల హాస్పిటల్‌:

పట్టణంలోని ప్రథమనంది దేవస్థాన ఆవరణలో ఆదివారం బంజారా కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. బంజారా కులదేవతల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. బంజారా సంస్కృతి సాంప్రదాయాలతో చిన్నారుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. జీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్‌ మాట్లాడుతూ బంజారాల ఐక్యతకు కార్తీక వనభోజనాలు దోహదపడతాయన్నారు. అనంతరం చిన్నారులకు బహుమతులు, అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణనాయక్‌, పుల్లన్న నాయక్‌, హత్తీరాం నాయక్‌, డా.కాంతారావునాయక్‌, నారాయణ నాయక్‌, లక్ష్మణ్‌నాయక్‌, జీపీఎస్‌ కార్యదర్శి రవినాయక్‌, జిల్లా అధ్యక్షుడు తిరుపాల్‌నాయక్‌, విద్యార్థి సంఘం నాయకులు రవీంద్రనాయక్‌, బద్రునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రథమనందీశ్వరాలయంలో..

నంద్యాల కల్చరల్‌: నంద్యాలలోని ప్రథమనందీశ్వరాలయ ప్రాంగణంలో రజకుల వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి గుంటూరు-2 ఎమ్మెల్యే గల్లా మాధవి, రజక సంఘం మహిళా నాయకురాలు, కర్నూలు జిల్లా న్యాయాధికారి కబర్ధి, నంద్యాల జిల్లా న్యాయాధికారి రాజు, న్యాయమూర్తులు, పట్టణ కిరాణ మర్చంట్స్‌ అసోసియేషన నాయకులు పాల్గొని స్వామివారికి అభిషేకాలు, కేదారేశ్వరీదేవికి కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రథమనందీశ్వర స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో అన్నదానం చేశారు. కార్యక్రమంలో చలంబాబు, అర్చకులు ప్రవీణ్‌కుమార్‌, మల్లిఖార్జున, వెంకటనారాయణ, రాజశేఖర్‌రెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:42 PM