Share News

క్యాన్సర్‌ నివారణపై అవగాహన ఉండాలి

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:06 PM

క్యాన్సర్‌ నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ సూచించారు.

   క్యాన్సర్‌ నివారణపై అవగాహన ఉండాలి
మాట్లాడుతున్న ప్రిన్సిపల్‌

కర్నూలు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చిట్టినరసమ్మ

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ సూచించారు. కర్నూలు మెడికల్‌ కాలేజీ న్యూ ఆడిటోరియంలో ఎనసీడీ-4.0 క్యాన్సర్‌ వ్యాధి నివారణపై అర్బన హెల్త్‌ సెంటర్ల మెడికల్‌ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాన్ని డీఎంహెచవో డాక్టర్‌ పి.శాంతికళ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ వ్యాధి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కర్నూలు స్టేట్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణప్రకాష్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించాలని, స్టేట్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌లో ప్రతి మంగళవారం, గురువారం ఓపీ నెంబర్‌ 222కు కేసులను పంపాలని సూచించారు. డీఎంహెచవో మాట్లాడుతూ క్యాన్సర్‌ వ్యాధిపై ఎన్నో అపోహలు ఉన్నాయని, వాటన్నింటిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మానవ శరీరంలో గోళ్లకు, వెంట్రుకలకు తప్ప శరీరంలోని అన్ని భాగాలకు క్యాన్సర్‌ సోకే ప్రమాదం ఉందన్నారు. ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్‌ డా.మహేశ్వర ప్రసాద్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ వ్యాధిని రోగులను గుర్తించి మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సంచార చికిత్స కార్యక్రమ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రఘు, డిప్యూటీ డెమో చంద్రశేఖర్‌ రెడ్డి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పద్మావతి, ఫ్లోరోసిస్‌ కన్సల్టెంట్‌ సుధాకర్‌, ఎనసీడీ ఎపిడమాలజిస్టు వేణుగోపాల్‌, ప్రొజెక్షనిస్టు ఖలీల్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 11:06 PM