Share News

పులకరించిన తుంగా తీరం

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:53 PM

మంత్రాలయం తుంగాతీరం ఆధ్యాత్మిక పరవళ్లతో భక్తులు పరవశించిపోయారు.

   పులకరించిన తుంగా తీరం
మంత్రాలయం పురవీదుల్లో మహారథం

వైభవంగా రాఘవేంద్రుడి మహారథోత్సవం

లక్షలాదిగా తరలివచ్చిన భక్త జనవాహిని

రథంపై నుంచి పీఠాధిపతి దివ్య సందేశం

మంత్రాలయం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం తుంగాతీరం ఆధ్యాత్మిక పరవళ్లతో భక్తులు పరవశించిపోయారు. గుండెల నిండా భక్తి నింపుకుని దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ‘మూలరామా విజయథే.. తుంగా తీరా నివాసా గోవిందా గోవిందా.. జయహో గురు రాఘవేంద్ర విజయహో.. పూజ్యాయ రాఘవేంద్రాయ నమో నమః’ అంటూ లక్షలాది మంది భక్తులు పులకించిపోయారు. రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాల్లో ఐదో రోజు అత్యంత ప్రాముఖ్యమైన ఉత్తారాధనలో భాగంగా మంగళవారం మహా రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మూల బృందావనానికి విశేష పూజలు చేసి మహా మంగళహారతులు ఇచ్చారు. వజ్ర వైడూర్య రత్నాలతో పొదిగిన హారం, బంగారు ఆభరణాలతో అలంకృతుడైన ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను సంస్కృత పాఠశాల వరకు ఊరేగించి తిరిగి శ్రీమఠానికి తీసుకువచ్చారు. రంగులు చల్లుతూ వసంతోత్సవంలో భాగంగా మఠం అర్చకులు, మఠం సిబ్బంది భక్తులపై రంగులు చల్లుతూ ఉల్లాసంగా, ఉత్సాహంతో ముందుకు సాగారు. శ్రీమఠం మహాముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌ భక్తులతో కిక్కిరిసింది. కళాకారుల ప్రదర్శనల నడుమ రథోత్సవం ఉత్సాహంగా సాగింది. ఈ రథోత్సవంలో రాజా ఎస్‌.గిరిరాజాచార్‌, మఠం దివాన సుజీంద్రాచార్‌, ఆనంద తీర్థాచార్‌, గౌతమాచార్‌, ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోనాపూర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, ఏఈలు బద్రినాథ్‌, శ్రీహరి, వ్యాసరాజాచార్‌, బిందు మాధవ్‌, సూపరింటెండెంట్లు అనంతపురాణిక్‌, రవి కులకర్ణి, జేపీ స్వామి, విజయేంద్రాచార్‌, ద్వారపాలక అనంతస్వామి, ప్రకాష్‌ ఆచార్‌, జయతీర్థాచార్‌, వాధిరాజాచార్‌లు పాల్గొన్నారు.

విశ్వవ్యాప్తికి హిందూధర్మం

ఫ సందేశమిచ్చిన పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు

పహల్గామ్‌లో ఉగ్రవాదులు అమాయకుల పర్యాటకులను హతమార్చిన ఘటనపై ప్రతి ఒక్కరూ ఖండించి సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తికి ముందుకు తీసుకెళ్లారని మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అన్నారు. మంగళశారం మహారథంపై నుంచి భక్తులకు అభివాదం చేస్తూ, సంస్కృతం, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ ఐదు బాషల్లో మహారథంపై నుంచి దివ్య సందేశాన్ని ఇచ్చారు. దేశ అభివృద్ది, భద్రత, శాంతిని నెలకొల్పేందుకు అందరూ సహకారం అందించాలన్నారు. దృష్ట శక్తులు, దేశ ద్రోహులు, శాంతికి ద్రోహం తలపెడితే సహించరానీ నేరం అన్నారు. కుల, మత బేదం లేకుండా అందరికీ వరాలిచ్చే రాఘవేంద్రస్వామి సజీవంగా యోగ శక్తిలో భక్తుల కష్టాలు తీర్చి వరాలు ప్రసాదించే రాఘవేంద్రులు కృప ఉంటుందన్నారు. పుష్కరిణి, తూర్పు, దక్షిణ పైభాగంలో స్వర్ణకవచం బృందావనం స్తంభాలకు బంగారు కవచాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది కొత్తగా 700 మందికి వసతి కల్పించామన్నారు. శ్రీమఠం ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని, సిబ్బంది హెల్త్‌ ఇన్సూరెన్స సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ శాంతి కోసం మూలరాములు, రాఘవేంద్రస్వామికి పూజలు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 12 , 2025 | 11:53 PM