Share News

బాలుడి ప్రాణాలు తీసిన షెడ్డు

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:59 AM

శిథిలావస్థలో ఉన్న మోటార్‌ షెడ్డు కూలి ఓ బాలుడు మృతి చెందగా, ఇద్దరు బాలు రులకు తీవ్ర గాయాలైన ఘటన పటమట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యనమల కుదురు లాకుల వద్ద బుధ వారం జరిగి ంది.

బాలుడి ప్రాణాలు తీసిన షెడ్డు

ఆడుకుంటుండగా కూలిన స్లాబ్‌

ఇద్దరు బాలురకు తీవ్ర గాయాలు

యనమలకుదురు లాకుల వద్ద ఘటన

ఆటోనగర్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): శిథిలావస్థలో ఉన్న మోటార్‌ షెడ్డు కూలి ఓ బాలుడు మృతి చెందగా, ఇద్దరు బాలు రులకు తీవ్ర గాయాలైన ఘటన పటమట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యనమల కుదురు లాకుల వద్ద బుధ వారం జరిగి ంది. పోలీసుల కథనం ప్రకారం.. యనమల కుదురుకు చెందిన అన్నదమ్ములైన మేడిశెట్టి షణ్ముఖ్‌, మేడిశెట్టి తరుణ్‌(11), పటమట కొత్త వంతెన సెంటర్‌కు చెందిన సూరగాని హరీష్‌ కుమార్‌ పటమటలోని గోవిందరాజుల పాఠశాలలో చదువుతున్నారు. బుధవారం పాఠశాలకు వెళ్లకుండా యనమలకుదురు లాకుల సమీపంలోని ఖాళీ స్థలంలోకి ఆడుకోవడానికి వెళ్లారు. కొన్నేళ్ల కింద బావి వద్ద మోటార్‌ కోసం చిన్న గది ఏర్పాటు చేశారు. ముగ్గురు బాలురులు ఆడుకుంటూ ఆ షెడ్డు పైకి ఎక్కారు. ఒక్కసారిగా ఆ షెడ్డు స్లాబ్‌ కూలి పోయింది. ఈ ప్రమాదంలో తరుణ్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. షణ్ముఖ్‌ ఎడమ మోకాలు, తలకు.. హరీష్‌కు ఎడమ కాలు తొడ భాగంలో విరిగింది. బాలురు అరుపులు విని స్థానికులు అక్కడకు చేరుకుని వారిని 108 సిబ్బంది సహాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి తరుణ్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. మిగిలిన ఇద్దరు బాలుర ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణవర్మ తెలిపారు. కాగా, పాఠశాలకు వెళ్లి ఉంటే ప్రమాదం తప్పేదని తల్లిదండ్రులు మేడిశెట్టి దుర్గాప్రసాద్‌, దివ్యలు గుండలవిసేలా రోధించారు. మేడిశెట్టి షణ్ముఖ్‌, చిన్న తరుణ్‌(11) పటమటలోని గోవిందరాజుల పాఠశాలలో 7, 6వ తరగతి చదువుతున్నారు. దుర్గాప్రసాద్‌ ఆటోనగర్‌లో లిఫ్ట్‌ మెకానిక్‌గా, దివ్య హోటల్‌లో పనిచేస్తున్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:59 AM