రెవిన్యూ డివిజన ప్రజల చిరకాల వాంఛ
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:53 PM
నూతన సంవత్సరం కానుకగా బనగానపల్లె రెవిన్యూ డివిజన ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ నెరవేర్చి వారి రుణం తీర్చుకున్నానని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
మంత్రి బీసీ
బనగానపల్లె, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం కానుకగా బనగానపల్లె రెవిన్యూ డివిజన ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ నెరవేర్చి వారి రుణం తీర్చుకున్నానని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మంత్రి క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ బుధవారం నుంచి బనగానపల్లె నూతన రెవిన్యూ డివిజన కార్యకలాపాలు ప్రారంభం కావడం పట్ల మంత్రి బీసీ సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా బనగానపల్లె రెవిన్యూ డివిజన ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ జనార్దనరెడ్డి గారికి, మంత్రి నారా లోకేశకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బనగానపల్లె రెవిన్యూ డివిజన గెజిట్ విడుదల చేసిన క్రమంలో బనగానపల్లె నుంచి ఆర్డీవో కార్యకలాపాలు కొనసాగడం సంతోషకరమైన విషయమన్నారు. నూతన సంవత్సరంలో బనగానపల్లె రెవిన్యూ డివిజనను కానుకగా ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి మంత్రి బనగానపల్లె వాసుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి బీసీః బనగానపల్లె నియోజకవర్గంలోని ప్రజలకు మంత్రి బీసీ జనార్దనరెడ్డి ప్రజలకు నూతన సంవత్సర బుధవారం శుభకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నాయకులకు, ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో సందర్భంగా మంత్రి ప్రజలకు అందుబాటులో ఉండరని పీఏ మురళీమోహనరెడ్డి బుఽధవారం తెలిపారు.