Share News

ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:47 PM

మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌.ఇర్ఫాన్‌బాష పేర్కొన్నారు.

ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమ్మెకు మద్ధతు తెలుపుతున్న కాంగ్రెస్‌ పార్టీ నేత

ప్రొద్దుటూరు టౌన్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌.ఇర్ఫాన్‌బాష పేర్కొన్నారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె చేపట్టిన మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ వర్కర్లకు ఆయన మద్ధతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 రోజులుగా ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఔట్‌సోర్శింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణాధ్యక్షుడు గోసంగి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 11:47 PM