Share News

విద్యుత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 21 , 2025 | 12:05 AM

విద్యుత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుతామని జేఏసీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి, వినుకొండ కృపవరం స్పష్టం చేశారు.

విద్యుత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

రిలే దీక్షలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి

నంద్యాల కల్చరల్‌, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): విద్యుత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుతామని జేఏసీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి, వినుకొండ కృపవరం స్పష్టం చేశారు. శనివారం నంద్యాల ఎస్‌ఈ కార్యాలయం దగ్గర విద్యుత జేఏసీ నాయకులు రిలేనిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ విద్యుత ఉద్యోగుల న్యాయమైన డిమాం డ్లను నెరవేర్చాలని కోరారు. సోమవారం కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి మెమోరాండమ్‌ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఏఈ రామయ్య, రవికుమార్‌, శ్రీరాములు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 12:05 AM