వైసీపీ నిర్లక్ష్యం వల్లే చెరువుకు గండి
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:44 AM
గత వైసీపీ పాలనలో నిర్లక్ష్యం వల్లే మద్దిగుండం చెరువుకు గండి పడిందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆరోపించారు.
నందికొట్కూరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో నిర్లక్ష్యం వల్లే మద్దిగుండం చెరువుకు గండి పడిందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆరోపించారు. మిడ్తూరు మండలం జలకనూరు గ్రామంలోని మద్దిగుండం చెరువును గురువారం ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలన కాలంలో మద్దిగుండం చెరువుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. దీంతోనే మద్దిగుండం చెరువుకు నిర్వహణ లేకపోవడంతో ఈ దారుణానికి ప్రధాన కారణమన్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖ డీఈ బసవరాజు, టీడీపీ నాయకులు సర్వోత్తమరెడ్డి, శివరామిరెడ్డి, పలుచాని మహేశ్వర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్‌యార్డు డైరెక్టర్ సురేంద్రరెడ్డి, నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ తిరుపాలు తదితరులు ఉన్నారు.
నందికొట్కూరు రూరల్: గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఎమ్మెల్యే జయసూర్య ఇంజీనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. గురువారం నందికొట్కూరు మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యశర్మ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జయసూర్యను వారు దుశ్శాలువాతో సన్మానించారు. పీఆర్ డీఈ రామ్మోహన్, ఉపాధి ఏపీడీ అన్వరాబేగం, అధికారులు పాల్గొన్నారు.