Share News

హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:53 PM

నియోజకవర్గంలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సంబంధిత అధికారులను ఆదేశించారు.

హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

నందికొట్కూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మార్కెట్‌ యార్డులో నియోజకవర్గంలోని అన్ని సంక్షేమ హాస్టళ్ల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. త్వరలో హాస్టళ్లను తనిఖీ చేస్తానన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. సమావేశంలో నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్ల అధికారులు పాల్గొన్నారు.

బాధితులకు అండగా సీఎం సహాయ నిధి

అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని బాధితులకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. పట్టణానికి చెందిన తొమ్మిది మంది బాధితులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరు అయిన రూ.7,10,836 చెక్కులను శనివారం ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నందికొట్కూరు మండల కన్వీనర్‌ మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, పట్టణ కన్వీనర్‌ భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు యాదవ్‌, సొసైటీ చైర్మన ముర్తుజావళి, క్లస్టర్‌ ఇనచార్జి మద్దిలేటి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:53 PM