Share News

వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:59 PM

మండలంలో జిల్లా పరిషత హై స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది.

వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత
కొత్తపల్లి జడ్పీ హై స్కూల్‌ పాఠశాల

కొత్తపల్లి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): మండలంలో జిల్లా పరిషత హై స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై నెల రోజులు కావస్తున్నా నేటికి పాఠశాలలకు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించలేదు. ప్రధానంగా గోకవరం జిల్లా పరిషత హై స్కూ ల్‌లో 3 నుంచి 10వ తరగతి వరకు 158 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ 3, 4, 5, 6 తరగతులకు సంబందించి మూడు ఎస్‌జీటీ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 6 నుంచి 10వ తరగతి వరకు బోధించే ఒక సోషల్‌ ఉపాధ్యాయ పోస్టు కూడా ఖాళీగా ఉంది. అంతేగాకుండా కొత్తపల్లి జడ్పీహెచఎ్‌సలో 270 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ కూడా సోషల్‌, ఇంగ్లీషు సబ్జెక్టులతో పాటు రికార్డు, ల్యాబ్‌ అసిస్టెంట్లు పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jul 07 , 2025 | 11:59 PM