Share News

సీహెచవోలతో ప్రభుత్వం చర్చలు జరపాలి

ABN , Publish Date - May 11 , 2025 | 12:15 AM

ప్రభుత్వం సీహెచవోలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వీసీహెచ వెంగల్‌ రెడ్డి కోరారు.

సీహెచవోలతో ప్రభుత్వం చర్చలు జరపాలి
మాట్లాడుతున్న ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వెంగల్‌రెడ్డి

కర్నూలు హాస్పిటల్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సీహెచవోలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వీసీహెచ వెంగల్‌ రెడ్డి కోరారు. వైద్యఆరోగ్య శాఖ ఎనహెచఎం కింద పనిచేస్తున్న సీహెచవోలు తమ సమస్యల సాధన కోసం చేపడుతున్న సమ్మె శనివారం 13వ రోజుకు చేరింది. నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్‌లో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల దీక్షా శిబిరాన్ని ఏపీ ఎన్జీవో నగర అధ్యక్షుడు ఎంసీ కాశన్నతో కలిసి సంఘీభావం తెలిపారు. వెంగల్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులను కాలరాసిందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల కోసం కృషి చేస్తుందన్నారు. రెండేళ్లుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుందన్నారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి దృష్టికి సీహెచవోల సమస్యలను తీసుకెళ్తానన్నారు. ఎనహెచఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలని, ఈపీఎ్‌ఫను పునరుద్ధరించాలని, అద్దె బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న సీహెచవోలకు ఎఫ్‌ఆర్‌సీ బయోమెట్రిక్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అనంతరం దేశ రక్షణలో ప్రాణాలర్పించిన భారత సైనికుడు మురళీనాయక్‌కు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏపీ గవర్నమెంటు నర్సెస్‌ అసోసియేషన జిల్లా కార్యదర్శి సి.బంగారి, ఏపీఎన్జీవో జిల్లా అసోసియేట్‌ ప్రెసిడెంటు ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి కృష్ణుడు, కోడుమూరు తాలుకా అద్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌, నగర కార్యదర్శి రామకృష్ణ, నగర అసోసియేట్‌ ప్రెసిడెంటు ఆర్లె శ్రీనివాసులు, ఫార్మాసిస్టు సంఘం రాష్ట్ర అసోసియేట్‌ ప్రసిడెంటు వీరాంజనేయులు, ఎంఎల్‌హెచపీ, సీహెచవోలు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 12:15 AM