ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:39 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. నరసింహస్వామిదేవాలయం ఆవరణలో గ్రామీణ నీటి సరఫరా,పారిశుద్య విభాగం నిధులు రూ.94.10లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
రూ.94.10లక్షలతో ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన
ఘనంగా ఏడాది పాలన వేడుకలు
కొమరోలు, జూన్ 4 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. నరసింహస్వామిదేవాలయం ఆవరణలో గ్రామీణ నీటి సరఫరా,పారిశుద్య విభాగం నిధులు రూ.94.10లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటై నేటికి ఏడాది అయిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు కొమరోలులో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొమరోలు మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను అశోక్‌రెడ్డి గుర్తుచేశారు. జగన్‌రెడ్డి పాలనలో గ్రామాలు, పట్టణాలు, చివరికి రాజధాని అమరావతి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాష్ట్ర ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం గాడిలోకి తెస్తున్నారని అశోక్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవో డీ బ్రహ్మయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ కిషోర్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ముత్తుముల సంజీవరెడ్డి, మార్కెట్ యా ర్డు ఉపాధ్యక్షుడు గోడి ఓబుల్‌రెడ్డి, సొసైటీ బ్యాంకు చైర్మన్‌లు బాలఈశ్వరయ్య, రవీంద్రారెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు తిరుమలరెడ్డి, షేక్ హసీనా, మాజీ సర్పంచ్ అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు.
కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ ధర్నా డ్రామా
మార్కాపురం : వైసీపీ పాలకులు చేసిన కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్‌రెడ్డి ధర్నాల డ్రామాకు తెరతీశారని టీడీపీ పోల్ మేనేజ్‌మెంట్ క్లస్టర్ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా వేడుకను బుధవారం స్థానిక దోర్నాల బస్టాండ్‌లో నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచా కాల్చారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎన్నికల్లో ఇచ్చిన హమీలను 70 శాతం అమలు చేయడం జరిగిందన్నారు. సామాజిక భద్రతా పింఛన్లను రూ.4వేలకు పెంచడం, మూడు ఉచిత సిలిండర్లు, రూ.5లకే అన్నా క్యాంటీన్‌ల ద్వారా భోజనం అందిస్తుందన్నారు. ఈ నెలలోనే తల్లికి వందనం, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు పథకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ విజయాలను జీర్ణించుకోలేని సైకో జగన్ అబద్ధాలను ప్రచారం చేసేందుకు రోడ్డెక్కుతున్నారన్నారు. ఆయన్ను ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున్, తాళ్లపల్లి సత్యనారాయణ, మాలపాటి వెంకటరెడ్డి, పఠాన్ ఇబ్రహీం, బీజేపీ నాయకులు బెల్లకొండ విజయలక్ష్మి, పీవీ కృష్ణారావు, పాదర్తి ఆంజనేయులు పాల్గొన్నారు.
రాచర్ల : ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని జనసేన పార్టీ మండల నాయకులు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు గిద్దలూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బెల్లంకొండ సాయిబాబు ఆధ్వర్యంలో బుధవారం ఏడాది పాలనపై సంబరాలు నిర్వహించారు. సైకో పాలనకు ప్రజలు చరమగీతం పాడి ఈరోజుకు ఏడాదైందన్నారు. ప్రస్తుతం ప్రజల ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పధంలో దూసుకుపోతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శంకర్‌నాయుడు, అలిశెట్టి వెంకటేశ్వర్లు, చిన్నా వెంకటరావు, బాలుడు, రవితేజ పాల్గొన్నారు.
తర్లుపాడులో ముగ్గుల పోటీలు
తర్లుపాడు : ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో తర్లుపాడులో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 26 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు సేతుల శ్రీనివాసులు మాట్లాడుతూ ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. పార్టీ ఆధ్వర్యంలో మున్ముందు సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన మహిళలకు ప్రథమ బహుమతిగా మిక్సీ, రెండో బహుమతిగా రైస్ కుక్కర్, మూడో బహుమతిగా డిన్నర్ సెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మువ్వా సురేశ్, మహేశ్, మోసే, ఎస్.సువర్ణ, కె.సునీల్, పఠాన్ కరిముల్లా, బాలరాజు, సూరె సువర్ణ, కృష్ణవేణి, నెహ్రూ యూత్ అధ్యక్షుడు బి.పుల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం : వెన్నుపోటు, గొడ్డలివేటు జగన్‌రెడ్డి వారసత్వ హక్కు అని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వ పాలనను చూసి ఓర్వలేక, వైసీపీ పాలనలో జరిగిన కుంభకోణాలు, అవినీతి, అక్రమాల్లో నేతలు అరెస్టు అవుతుండడంతో ప్రజల దృష్టిని మరల్చడానికి జగన్‌రెడ్డి రోడ్డె క్కి నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారన్నారు. ఇలాంటి వెన్నుపోటు కార్యక్రమాలను చూసి ప్రజలు జగన్‌రెడ్డిని నమ్మే స్థితిలో లేరని ఎరిక్షన్‌బాబు అన్నారు. వైసీపీ పార్టీ ఆవిర్భావమే వెన్నుపోటుతో అయిందని, వైసీపీ పార్టీని రిజిస్టర్ చేసుకున్న శివకుమార్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని ఏర్పాటు చేశారన్నారు. బాబాయిని గొడ్డలితో నరికి చంపిన కిరాతకుల్ని కాపాడుతూ రక్తసంబంధీకులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్‌రెడ్డిదన్నారు. ఆస్థికోసం తల్లిని, చెల్లిని గెంటేసి వాళ్లకు వెన్నుపోటు పొడిచారన్నారు. వెన్నుపోట్లకు కేరాఫ్ జగన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వ పాలనలో 70 శాతం హామీలు నెరవేరాయని అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలతో ముందుకు సాగుతామని ఎరిక్షన్‌బాబు అన్నా రు. సమావేశంలో పుల్లలచెరువు మండల టీడీపీ అధ్యక్షుడు ప్రసాద్, టీడీపీ నియోజకవర్గ నాయకులు శనగా నారాయణరెడ్డి, చిట్యాల వెంగళరెడ్డి, సుబ్బారెడ్డి, మంత్రునాయక్, సత్యనారాయణ గౌడ్, సుబ్బారావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మల్లికార్జునరావు, ఆదిరెడ్డి, అంజయ్య, క్లస్టర్ ఇన్‌చార్జి మస్తాన్‌వలి, రాములు పాల్గొన్నారు.