ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:20 AM
ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరు (శుద్ధజలాలు) అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.
పాములపాడు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరు (శుద్ధజలాలు) అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. శుక్రవారం పాములపాడు ఎస్సీ కాలనీలో టీడీపీ నాయకులు ఎల్లయ్య, కురువ రమే్‌షతో కలిసి మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అంతకుముందు ఎంపీకి ఘనస్వాగతం పలికారు. గ్రామంలో వాటర్ ట్యాంక్, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ భాగ్యమ్మ ఎంపీకి వినతి పత్రం అందించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు విన్నవించారు. అలాగే స్థానికంగా ఉన్న పీహెచసీ శిథిలావస్థకు చేరుకుందని వైద్య సిబ్బంది ఎంపీ దృష్టికి తీసుకవచ్చారు. మోడల్‌స్కూల్ బాలికల వసతిగృహంలో గ్లీజరు ఏర్పాటు చేయించాలని ప్రిన్సిపాల్ నాగరవీంద్ర కోరారు. పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకవచ్చారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, టీడీపీ నాయకులు కురువ వెంకటేశ్వర్లు, నాగరాజు, టేకూరి సాయిక్రిష్ణ, సురేశ, మల్లికార్జునయాదవ్, బాలీశ్వరరెడ్డి, హుస్సేనబాషా, లోకేశ, ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు.
కొండజూటూరులో..
పాణ్యం: మండలంలో ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం ప్రారంభించారు. మద్దూరులో రూ. 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, పాణ్యం డొంగు రస్తాలో రూ. 9లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, కొండజూటూరులో రూ. 5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంటును ఎంపీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శివమోహన, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, సర్పంచ ప్రదీ్‌పకుమార్ రెడ్డి, మాజీ సర్పంచ సిద్దం నారాయణ, పీఆర్‌ఏఈ మహబూబ్‌బాష, పుల్లారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
భాస్కరాపురం గ్రామంలో..
జూపాడుబంగ్లా: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలేకుండా సురక్షిత మంచినీటిని అం దించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. మండలంలోని భాస్కరాపురం, రామసముద్రం గ్రామాల్లో ఎంపీ నిధులతో ని ర్మించిన మినరల్ వాటర్‌ప్లాంటును ఎంపీ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ మాధ వి, తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్, ఎంపీడీవో గోపికృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నాగేంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.